
నెల్లూరు ( జనస్వరం ) : సంగం మండలంలోని దువ్వూరు గ్రామంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైగా అవుతుంటే కనీసం మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ కాలువ మరియు రోడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చేయలేని పని, ఆత్మకూరు జనసేన పార్టీ చేస్తుందని స్థానిక ప్రజలు అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సహకారంతో మరియు దువ్వూరు జనసైనికుల ఆర్థిక సహాయంతో ఈ డ్రైనేజీ కాలవను నిర్మించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దాడి.భాను కిరణ్ మరియు ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున గెలుపొందిన వార్డ్ నెంబర్ ఆకులేటి సుధాకర్ గారు శ్రమదానంలో పాల్గొనడం జరిగింది.