
శ్రీకాకుళం జిల్లా, నందిగామ మండలం, సైలాడ పంచాయతీ, దేవడా గ్రామంలో టెక్కలి జనసేనపార్టీ ఇంచార్జీ కణితి కిరణ్ కుమార్ గారు పర్యటించారు. ఈ పర్యటనలో దేవాడ ప్రజల ముఖ్య సమస్యలైన డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను కిరణ్ తెలుసుకొని వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని చెప్పారు. గతంలో కూడా అధికారులకు పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. ఈ పర్యటనలో సైలడా జనసేన పార్టీ M.P.T.C అభ్యర్థి తాడేల చిరంజీవి, టెక్కలి జనసేన నాయకులు ముడిధన పూర్ణ చంద్రరావు, నందిగామ మండల జనసేన నాయకులు పళ్ల బాలకృష్ణ, ఈశ్వరరావు, సింహాచలం, దేవడా యూత్ ఉన్నారు.