
తామరఖండి, (జనస్వరం) : సీతానగరం, తామరఖండి గ్రామంలో జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామం నుంచి ఇసుక అక్రమ రవాణాకు కొంతమంది అధికార పార్టీ శ్రేణులు అక్రమాలకు పాల్పడుతున్న సమయంలో ఆందోళన చెందుతున్న గ్రామస్తులకు మేమున్నామని ధైర్యం చెప్పడం జరిగింది. వైసిపి దాష్టీకమైన విధానాలను అడ్డుకోవడానికి జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.