టీడీపీ కార్యాలయాలపై దాడిని ఖండించిన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్

   హైదరాబాద్, (జనస్వరం) :  ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇలాంటి సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. జనసేన పార్టీ ఐటీ వింగ్ మీటింగ్ లో ఉండగా మంగళగిరి, గుంటూరుల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగిన విషయం నా దృష్టికి వచ్చింది. విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లో వారి నాయకుల మీద కూడా దాడులు జరిగాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నియంత్రణ అవసరం. ఈ విధంగా వ్యక్తిగత దాడులు గానీ, పార్టీ కార్యాలయాల మీద, నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగితే అది అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖలు దీని మీద దృష్టి సారించాలి.

అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా తయారవుతుంది

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సత్వరం చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషుల్ని పట్టుకుని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్ లా తయారవుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలి. దాడికి పాల్పడిన వారు వైసీపీ వర్గీయులని చెబుతున్నారు. అదే నిజం అయితే వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాం. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. దయచేసి దీన్ని సరి చేసుకోవాలని కోరుతున్నాం. అంతా క్షేమంగా, ధైర్యంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సత్వరం దీని మీద దృష్టి సారించాలి. విమర్శలు, ప్రతివిమర్శలు చేసేటప్పుడు నియంత్రణ పాటించాలి. విమర్శ హర్షించే విధంగా ఉండాలి తప్ప… ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా ఉండకూడదు అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way