Logo
Date of Publish : 19 October 2021, 4:34 pm
Editor : Sake Naresh

టీడీపీ కార్యాలయాలపై దాడిని ఖండించిన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్

   హైదరాబాద్, (జనస్వరం) :  ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇలాంటి సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. జనసేన పార్టీ ఐటీ వింగ్ మీటింగ్ లో ఉండగా మంగళగిరి, గుంటూరుల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగిన విషయం నా దృష్టికి వచ్చింది. విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లో వారి నాయకుల మీద కూడా దాడులు జరిగాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నియంత్రణ అవసరం. ఈ విధంగా వ్యక్తిగత దాడులు గానీ, పార్టీ కార్యాలయాల మీద, నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగితే అది అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖలు దీని మీద దృష్టి సారించాలి.

అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా తయారవుతుంది

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సత్వరం చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషుల్ని పట్టుకుని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్ లా తయారవుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలి. దాడికి పాల్పడిన వారు వైసీపీ వర్గీయులని చెబుతున్నారు. అదే నిజం అయితే వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాం. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. దయచేసి దీన్ని సరి చేసుకోవాలని కోరుతున్నాం. అంతా క్షేమంగా, ధైర్యంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సత్వరం దీని మీద దృష్టి సారించాలి. విమర్శలు, ప్రతివిమర్శలు చేసేటప్పుడు నియంత్రణ పాటించాలి. విమర్శ హర్షించే విధంగా ఉండాలి తప్ప... ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా ఉండకూడదు అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com