Search
Close this search box.
Search
Close this search box.

కాపులకు రాజ్యాధికారం జనసేనపార్టీ – పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం : చేగొండి హరి రామ జోగయ్య శాస్త్రి 

కాపు

           న్యూస్ ( జనస్వరం ) : ఇటీవల వివిధ పార్టీలకు చెందిన కాపు కుల ప్రముఖులు కొందరు హైదరాబాద్‌లో జరిగిన యిష్టాగోష్టి సమావేశంలో కాపు కులస్తుడు ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేబట్టే అవకాశాలను గురించి చర్చించినట్లు జరిగింది. వివిధ పార్టీలకు చెందిన నేతలు కాపుల ఐకమత్యాన్ని గురించి ఎవరైనా కాపు నాయకుని  గురించి ఆలోచించటం విడ్డూరంగా ఉంది. వీరిలో JD లక్ష్మి నారాయణగారు లాంటి ఒకరిద్దరు మినహా కాస్తో కూస్తో ప్రజల మన్నలను పొందిన వారు లేరు. కొత్త రాజకీయ పార్టీ పెట్టి నడపగలిగిన శక్తి ఉన్నవారు లేరు. వీరిలో కొంతమంది కలిసి రాజకీయ పార్టీని పెడితే కాపులు ఓట్లు చీలిపోయి యితర రాజకీయ పార్టీలు బలపడటానికి ఉపయోగపడుతుంది తప్ప వీరు పెట్టే పార్టీ వీరికున్న కొద్ది పలుకుబడితో రాజకీయాధికారం చేజిక్కునే అవకాశం అసలే లేదు. చిరంజీవికి కాని, పవన్‌ కళ్యాణ్ గాని రాజ్యాధికారం పొందే అవకాశం లేదన్నది వీరి వాదనగా కనబడుతూ ఉంది. కావు కులస్తుడు ప్రత్యేక పార్టీ పెట్టి నడుపుతున్నది ఒక్క పవన్‌ కళ్ళాణ్‌ మాత్రమే. కులాల ఐక్కత కావాలి అనేది జీరో బడ్జెట్టు రాజకీయాలు కావాలనేది ఇతని నినాదం. కాపులు పెద్దన్న పాత్ర వహించి అన్ని కులాలను కూడగట్టి రాజ్యాధికారం వైపు పయనించాలి అనేది యితన్ని సిద్దాంతం. ఈ సిద్దాంతంలో పవన్‌ కళ్ళాణ్‌ రాజ్యాధికారం పొందగలుగుతాడా అనేది ప్రశ్న. కాపు కులస్తులు ఐక్యతతో నడవగలిగితే బిసి, ఎస్‌సి. ఎస్‌టి. మైనార్టీలను కలువుకొని వెళ్లగలిగితేనే ఇది సాధ్యమే అని ఘంటాపథంగా చెప్పగలం. అంతేకాని ప్రతీ కాపువాడు వేరు వేరు పార్టీలలో ఉండి, అవసరం అయితే కాపులు జనసేన మినహా వ్రత్యేక పార్టీ పెట్టి నడవాలనేది కాపులను చీల్చడానికి ఉపయోగపడుతుంది. కాని కాపు వాడు ముఖ్యమంత్రి కాగల పరిస్థితికి మాత్రం దారి తీయదు. జనసేనను కాదని వేరే పార్టీ పెట్టే ఆలోచనలు చేన్తున్న కొందరు కాపు నాయకుల అంతర్యం కాపులకు రాజ్యాధికారం దక్కటం కోసమా? లేక కాపులను చీల్చాలనే వైఎస్‌ఆర్‌. పార్టీ వ్యూహాల్లో భాగమా అనేది ఆలోచించవలిసి వస్తున్నది. రాజకీయ లబ్ధి కోరి ఇది వైఎస్‌ఆర్‌. పార్టీ వ్యూవోల్లో భాగమే అనేది చెప్పవలసి వన్తుంది. రాబోయే జనరల్‌ ఎన్నికలలో ఇలాంటి వ్యూహాలను పన్ని రాజ్యాధికారాన్ని మరోసారి దక్కించుకొనటానికి అధికార పక్షం అనేక ప్రయత్నాలు చేన్తున్నది. వారి వలలో వడక జాగ్రత్త పడితేనే జనసేన నాయకుడు, కావులు, బడుగు బలహీన వర్గాల ఏకైక నాయకుడు పవన్‌ కళ్ళాణ్‌ ని ముఖ్యమంత్రి గద్దె నెక్కించగలుగుతాము. ఏనాటి నుండో తీరని తోరిక నెరవేరుతుంది. 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాల జాతకాలు మెరుగవుతాయి. కేవలం 10 శాతం కూడ జనాభా లేని కొద్దిమంది రాజకీయ నాయకుల పెత్తనానికి ముగింపు వలకవచ్చు. 

– చేగొండి హరి రామ జోగయ్య శాస్త్రి 

కాపు సంక్షేమ సేన 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way