
చామవరం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా, తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేనపార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి పితాని బాలకృష్ణ, బోడపాటి శివదత్, చోక్క కాశీ, నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది. గెడ్డం బుజ్జి మాట్లాడుతూ నాకు తుని, పాయకరావుపేట రెండు కళ్ళు లాంటివి అని, చామవరం జనసైనికులతో పాటు తుని నియోజకవర్గ జనసైనికులు మీకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చిన నేను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.