
టెక్కలి, (జనస్వరం) : శ్రీకాకుళము జిల్లా టెక్కలి నియోజకవర్గములో జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా టెక్కలి మండలం సతివాడ గ్రామంలో టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటించడం జరిగింది. అలాగే గ్రామస్తులను, గ్రామ పెద్దలను, యువతను కలసి గ్రామ సమస్యలను తెలుసుకోవడం జరిగినది. ఈ పర్యటనలో జనసేన నాయకులు లాయర్ రాంప్రసాద్, కొత్తూరు హరి, క్రాంతి, స్వాదీన్, దాసరి బాపూజీ, శ్యామ్, ప్రసాద్, సూర్యప్రకాష్ లు పాల్గొన్నారు.