Search
Close this search box.
Search
Close this search box.

వైకాపా పాలనలో మత్స్యకారులకు తీరని అన్యాయం : జనసేన పార్టీ మత్స్యకార వికాస కమిటీ ఛైర్మన్ బొమ్మిడి నాయకర్

మత్స్యకార

    ఎచ్చెర్ల, (జనస్వరం) : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మత్స్యకారులకు తీరని అన్యాయం జరుగుతోందని జనసేన పార్టీ మత్స్యకార వికాస్‌ కమిటీ చైర్మన్‌ బొమ్మిడి నాయకర్‌ అన్నారు. ఈ మేరకు మండలం డి.మత్స్యలేశం గ్రామంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సముద్రతీరంలో చేపలవేటకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మత్స్యకారుల వలసల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. జెట్టీలు, హార్చర్‌లు నిర్మించాలని డిమాండ్‌ చేసారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నేతలు ఘంటసాల విజయలక్ష్మి, యోగిరామకృష్ణ, క్రాంతిశ్రీ, అర్జున్‌, వైతన్య, సయ్యద్‌ విశ్వక్షేన్‌, భూపతి అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way