అనంతపురం సిటీ, (జనస్వరం) : అనంతపురం నగరంలో రోడ్ల విస్తరణ జరుగుతున్న సమయంలో గతవారం నుంచి మున్సిపాలిటీ పరిధిలోని మంచినీటి పైపులు పూర్తిగా దెబ్బ తినడం వలన త్రాగునీటికి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంలో నగరంలోని మునిసిపాలిటీ అధికారులు చొరవ చూపి వీలైనంత త్వరగా ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం కాకుండా మరమ్మతులు చేసి నగర ప్రజలకు త్రాగునీటి సమస్య నుంచి విముక్తి చేయవలసిన బాధ్యత మునిసిపాలిటీ వ్యవస్థలోని అధికారులకు, నగర మేయర్‌కు బాధ్యత ఉన్నది. కావున మేము జనసేన పార్టీ తరఫున ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ప్రజలను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా ఎక్కడైనా తప్పని పరిస్థితుల్లో సమస్య వచ్చిన వెంటనే ఆ ఏరియా పరిధిలోని ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వెంటనే మునిసిపాలిటీ వ్యవస్థ వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయవలసిందిగా జనసేనపార్టీ తరఫున తెలియజేస్తున్నాము. అంతేకాకుండా నగరంలో రోడ్ల విస్తరణ జరుగుతున్న సందర్భంలో డ్రైనేజ్ కాలువలలోకి మట్టి పడడం వలన రహదారుల మీదపై మురికి నీరు ప్రవహించడం వలన పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ప్రజలకు నీటి సమస్య రాకుండా మీ అధికార యంత్రాంగం బాధ్యతగా చూసుకోవాలని జనసేనపార్టీ నగర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంఛార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, జిల్లా కార్యదర్శి సిద్దు, అర్బన్ నాయకులు గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, రోళ్ల భాస్కర్, వెంకట్ నారాయణ, విశ్వనాధ్, అశోక్, సంపత్, నాగార్జున, మళ్లీ, వీర మహిళ రూప పాల్గొన్నారు.