మాడుగుల ( జనస్వరం ) : జనసైనికుల శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలో చీడికాడ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రారంభమైనది. జనసేన నాయకులు బొయిదాపు కిరణ్ ప్రారంభించి రాయపురెడ్డి కృష్ణతో మొదటి సభ్యత్వం నమోదు చేయించారు. ఈ సందర్బంగా బోయిదాపు కిరణ్ మాట్లాడుతూ జనసేన పార్టీకోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తలకు భరోసాగా, ప్రమాద భీమా కల్పించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీల సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సభ్యత్వం తీసుకున్న జనసైనికులకు 5లక్షలు రూపాయల భీమా, పదివేల నుండి యాభై వేల రూపాయల వరకూ తక్షణ ప్రమాద సహాయం ఉంటుంది అని తెలిపారు. దేశంలో ఏ పార్టీ చెయ్యలేనటువంటి ఇంత గొప్ప భీమా సౌకర్యం కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని, జనసేన అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్న నాలుగు మండలాల జనసైనికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, క్రియాశీల సభ్యత్వం వాలంటీర్లు అందరూ పాల్గొన్నారు.
వి.ఆర్.ఏ ల పోరాటానికి జనసేన పార్టీ సంఘీభావం:
కనీస వేతనం పెంచాలని, డి.ఏ ఉపసంహారణ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని పోరాటం చేస్తున్న చీడికాడ వి.ఆర్.ఏ ల పోరాటానికి మద్దతుగా బొయిదాపు కిరణ్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు సంఘీభావం ప్రకటించారు. వారు మాట్లాడుతూ మాట తప్పను – మడమ తిప్పను అని అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి గారు ఇప్పుడు అన్ని వర్గాలకు వెన్ను చూపించి నయవంచనకి గురిచేస్తున్నారని తెలిపారు. వి.ఆర్.ఏలు డిమాండ్లు న్యాయమైనవి అని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.వి. మూర్తి, యాళ్ళ ప్రసాద్, గట్టా రామారావు, ముర్రు ఈశ్వర్, హరి బాలకృష్ణ, పైడా మధు, నానాజీ, మజ్జి కృష్ణ, భాను, సురేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.