
గుంతకల్లు, (జనస్వరం) : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ యువ నాయకులు టీ. విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గుంతకల్లు యువ రచయిత మరియు “మనం ఫర్ మార్పు” వ్యవస్థాపకులు “శ్రీ హర్ష వర్ధన్” వ్రాసిన “మిత్రమా! మేలుకో” “ఒక్క భారతీయుడి కలం” అన్నే పుస్తకానికి ఆవిష్కరించిన జనసేన పార్టీ యువ నాయకులు టీ. విజయ్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ యువతను ఆలోచింప చేసే విధంగా పుస్తకాన్ని రచించిన శ్రీ హర్ష వర్ధన్ ని టీ. విజయ్ కుమార్ అభినందించారు. అనంతరం యువ రచయితను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.