
బద్వేల్, (జనస్వరం) : కడప జిల్లా బద్వేల్ నియోజవర్గం పోరుమామిళ్ల మండలం మామిళ్ల పంచాయతీలో ఉన్న గాంధీబొమ్మ సెంటర్లో మండల ఇంఛార్జ్ శీలం శెట్టి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బద్వేల్ నియోజవర్గం నాయకులు బసవి రమేష్ గారు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు తెలియజేస్తామని చెప్పారు. మండల ఇంఛార్జ్ లక్ష్మయ్య గారు మాట్లాడుతూ మండలంలోని ప్రతి గడప తిరిగి పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమములో నరసింహ, శ్రీను, మల్లి, హరిప్రసాద్, మహేష్, ఇమ్రాన్ మరి జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.