
ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలోని అన్నపూర్ణమ్మ అనే ఒక అవ్వకు 72 ఏళ్ల నిండిన ఇంకా పెన్షన్ రావట్లేదు. అవ్వ 50ఏళ్ల నుంచి జీవన ఉపాధి చేనేత వస్త్రాలు నెయ్యడం. ఇప్పటికీ అవ్వ ఉపాధి మీద ఆధారపడి కుటుంబం బ్రతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిక్కోలు అంపిలి.విక్రమ్ వారి ఇంటికి వెళ్లి అవ్వని పరామర్శించి, కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే కొద్దీ రోజుల్లో అవ్వకి పెన్షన్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తాం అని జనసేన పార్టీ తరుపున భరోసా ఇవ్వడం జరిగింది.