Search
Close this search box.
Search
Close this search box.

చెత్తపై జనసేన పోరుబాట : ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు

    ఏలూరు, (జనస్వరం) : ఏలూరు నగరంలో అపరిశుభ్రత అధికంగా ఉందని, రహదారులన్నీ చెత్తాచెదారాలతో అధ్వానంగా మారాయని, దీనిపై జనసేన ప్రజల కోసం పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉందని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. జనసేన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఏ వీధిలో చూసినా అపరిశుభ్రతే దర్శనమిస్తోందని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫొటోలను ప్రదర్శించారు. ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిసిటీకే పరిమితమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు నగర అధ్యక్షుడు కాశీ నరేష్‌, ఉపాధ్యక్షుడు బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు సాయిచరణ్‌ తేజ్‌, నగర సహాయ కార్యదర్శి ధర్మేంద్ర, మండల కోశాధికారి పైడి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way