అరకు ( జనస్వరం ) : ఇంటింటికి జనసేన మాటలు తీసుకెళ్ళు భాగంగా జనసేన నాయకులు సాయి బాబా, దురియా. అల్లంగి, రామకృష్ణ ఆధ్వర్యంలో అరకు వేలి మండలం మాడాగాడా పంచాయితీ హెడ్క్వార్టర్ కుమ్మర వీధిలో పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. వారు మాట్లాడుతూ నేటికి ఏ ప్రభుత్వం కూడా వారిని గిరిజనులుగా గుర్తించి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా గిరిజన ఆచారాలు, సాంప్రదాయాలకు, అనుగుణంగా జీవిస్తున్న మాకు ఇంతవరకు గిరిజనులుగా గుర్తించి న్యాయం చేయక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు జనసేన దృష్టికి తీసుకొచ్చారు. గెజిట్ 23లో వారికి నాయక్ గా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు వారికి గిరిజనులుగా గుర్తించకపోవడంతో విద్యా పరంగా, వైద్యపరంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలుకి అందని ద్రాక్ష వల్లే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందిస్తూ జనసేన రామకృష్ణ మాట్లాడుతూ ఈ సమస్యలను అధినేత జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని వారిని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి సమస్యలను స్పందిస్తూ గిరిజనులను గుర్తించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.