Search
Close this search box.
Search
Close this search box.

రైతులకు లాభసాటి ధర సాధనే జనసేన లక్ష్యం – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

రైతులకు లాభసాటి ధర సాధనే జనసేన లక్ష్యం – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలన్నదే జనసేన పార్టీ లక్ష్యమని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అందుకు పార్టీ తరపున “జై కిసాన్” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. రకరకాల వ్యవసాయ సంఘాలు, శాస్త్రవేత్తలతో చర్చించి, సంప్రదింపులు జరిపి కార్యక్రమాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం తిరుపతిలోని మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “తిరుపతికి వచ్చే ముందే రెండు తుపాన్లు రాబోతున్నాయని సమాచారం ఉన్నా… నష్టపోయిన రైతుకు భరోసా కల్పించేందుకు పర్యటన చేయాలని నిర్ణయించుకున్నాం. క్షేత్ర స్థాయిలో పర్యటించిన అనంతరం, మా జిల్లా స్థాయి నాయకులతో కూడా పర్యటనలు జరిపి పంట నష్టంపై నివేదిక తయారు చేస్తాం. ఆ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించడంతో పాటు ప్రజలకు తెలియజేస్తాం.

కౌలు రైతును విస్మరించడమే దుబ్బాక అపజయానికి ఓ కారణం  

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం అందుతుంది. కానీ కౌలు రైతులకు మాత్రం అలాంటి సాయం అందడం లేదు. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓడిపోవడానికి ఒక కారణం కూడా కౌలు రైతులను విస్మరించడమే. క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు చాలా మంది కౌలు రైతులు నా దగ్గరకు వచ్చి ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ ఎంత అండగా నిలిచిందో అదే విధంగా చివరి కౌలు రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంది.  

అన్నదాతను ఆదుకోవడానికి ఎందుకు ఆలోచన?

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వాలు మంచి చేస్తే అండగా నిలబడాలి, చెడు చేస్తే నిలదీయాలి. ఇవాళ లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోతే రూ. 5 వేలు, రూ. 10 వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోంది. అది సరైన పద్దతి కాదు. ప్రభుత్వం దగ్గర చాలా నిధులు ఉన్నాయి. మద్యం, ఇసుక వ్యాపారం ప్రభుత్వమే చేసి ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తోంది.  మరి.. అన్నం పెట్టే రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తోంది? పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 35 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం.  ఈ డిమాండ్ రాజకీయ లబ్ధి కోసం చేసింది కాదు. క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు ఎకరా పంట వేయడానికి రూ. 40 నుంచి రూ. 50 వేలు పెట్టుబడి అవుతుందని రైతులు చెప్పారు. అందుకే నష్టపరిహారం రూ. 35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. 48 గంటల్లో కనీసం రూ. 10 వేలు ముందస్తు సాయం అందించాలని కోరాం.  రూ. 10 వేలు ఇవ్వాలని అడగడం వెనక కూడా కారణం ఉంది. ప్రభుత్వం డిసెంబర్ 25 తర్వాత నష్టపరిహారం అందిస్తామని చెబుతోంది. ఇప్పటికే నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ముందస్తుగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 10 వేలు అందించాలని కోరాం.  హైదరాబాద్ నగరంలో ఇటీవల వరదలు వస్తే అక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించి రూ. 650 కోట్లు విడుదల చేసి ప్రతి ఇంటికి రూ. 10 వేల సాయం అందించారు. వైసీపీ ప్రభుత్వం కూడా తక్షణ నష్టపరిహారంగా రూ. 10 వేలు అందించాలి. నష్టపరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. స్పందన రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. 

రైతులకు మంచి చేయాలనే…

దేశంలోని అందరి రైతులకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఎన్డీయే ప్రభుత్వం కిసాన్ బిల్లు తీసుకొచ్చింది. బిల్లుపై అభ్యంతరాలు, తప్పొప్పులు ఉంటే చెప్పండి అని కేంద్ర పెద్దలు కూడా అడుగుతున్నారు. రైతులకు నష్టం జరిగే పని ఎవరూ చెయ్యరు. కేంద్ర ప్రభుత్వం అదే దృష్టితో చూస్తుందని మనస్ఫూర్తిగా నమ్మతున్నాను. 

రజనీకాంత్ గారు విజయవంతం కావాలి

త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లో రెండు పార్టీల సంయుక్త కమిటీ సూచనలు మేరకే అభ్యర్థి ఎంపికపై ముందుకు వెళ్తాం. దీనిపై ఇరుపార్టీల పెద్దలు కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో కొత్త వ్యక్తి రాజకీయాల్లోకి రావాలనుకుంటే మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ఇవాళ శ్రీ రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయాల్లో విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. చొక్కా నలగకుండా రాజకీయాలు ఎవరూ చేయలేరు. ఇబ్బందులు ఉంటాయి, కేసులు పెడతారు అన్ని తట్టుకొని నిలబడాలి. గొడవలు పెట్టుకోవాలనే ఆలోచన జనసేనకు లేదు. కార్యకర్తలకు ఇబ్బందులు కలిగితే మాత్రం తప్పకుండా వారికి అండగా నిలబడుతుందని” తెలిపారు. 

151 మందినీ అడగండి

తుపాన్ వల్ల నష్టపోయిన ఏపీకి విరాళం ఇస్తున్నారా అని ఓ విలేకరి ప్రశ్నిస్తే అందుకు స్పందిస్తు“విరాళం ఎంతిస్తారు అనే ప్రశ్న ఒక్క పవన్ కళ్యాణ్ నే అడుగుతారు ఎందుకు… అందరిని అడగాలి. 151 మంది ఉన్నారు.. వాళ్ళనీ అడగండి. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులను ఈ ప్రశ్న అడగాలి. నా వంతు కృషి నేను చేసుకుంటూ వెళ్తాను. మనం అందరం ట్యాక్సులు కడతాం. ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. ఆదుకోవడం అనేది ప్రభుత్వం ముందస్తు బాధ్యత. విరాళం అనేది స్పందించి ఇచ్చేది. విరాళం ఇస్తున్నామంటే గుర్తింపు కోసమో, ఓట్లు కోసమో కాదు. సైనికబోర్డు కు విరాళం ఇచ్చాను, కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చాను, హుదూద్ వచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చాను.  నేనొక్కడినే డబ్బున్నోడిని, సంపాదిస్తున్నోడిని కాదు. ఎవరిస్థాయిలో వారి విరాళం ఇవ్వొచ్చు. రూ.300 కోట్లు, రూ. 400 కోట్లు పెట్టి రాజ్యసభ సీట్లు కొనుక్కున్నోళ్లు ఇవ్వొచ్చు. ఎమ్మెల్యేగా గెలవడానికి రూ. 30 నుంచి రూ. 50 కోట్లు ఖర్చుపెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి కష్టసమయంలో వ్యక్తిగతంగా ఎంత ఇస్తున్నారో అడగాలి. ప్రభుత్వం తరఫున ఇవ్వడం కాదు వ్యక్తిగతంగా ఎంతిస్తున్నారో అడగాలి”అన్నారు

ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకే పర్యటన : శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “నివర్ తుపాను వల్ల రైతులు, కౌలు రైతులతోపాటు సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఆ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా మా నాయకులు టెలికాన్ఫరెన్స్ లో అధ్యక్షుల వారు శ్రీ పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. వారు ఎంత తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని వారు వినిపించినప్పుడు రైతుకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో వెంటనే ఐదు జిల్లాల పర్యటనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తక్షణం చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువద్దాం అన్న ఉద్దేశంతో ఈ పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతులతో ముఖాముఖి మాట్లాడినప్పుడు ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారు శాసనసభలో పరస్పర ఆరోపణలకే సమయం సరిపెడుతున్నారు. చిత్తూరు జిల్లాలో కూడా సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అయితే ఇక్కడ పరిస్థితులు వేరు. భారీగా మూగజీవాలు చనిపోయాయి. ఆ రైతాంగం గురించి కూడా పార్టీ నాయకులు ప్రస్తావించారు. అన్నింటి మీద అవగాహన తెచ్చుకుని ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ప్రజల పక్షాన నిలబడాలన్న ఉద్దేశంతో రేపు చిత్తూరు జిల్లాలో, మరుసటి రోజు నెల్లూరు జిల్లాలో పర్యటన ఏర్పాటు చేయడం జరిగింద”ని అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు డా.పి.హరిప్రసాద్, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ రాందాస్ చౌదరి, శ్రీ కిరణ్ రాయల్ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way