
నెల్లూరు జిల్లా తడ మండలం లోని తడ కండిగ గిరిజన కాలనీ నందు చలి తీవ్రత ఎక్కువగా ఉండడం కారణం వల్ల 100 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంవి సేవా సంఘం సభ్యులు మాభాష. దాము.రేవంత్. మరియు వరుణ్ తేజ్ యువత అధ్యక్షుడు గజ సాయి మాట్లాడుతూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం చేస్తున్నామన్నారు. చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మా భాష మాట్లాడుతూ మా అన్నయ్య డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. చలి తీవ్రత కారణంగా గిరిజన కాలనీ నందు వృద్ధులకు దుప్పట్లు పంచామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నోద్. ప్రవీణ్, రాజు, పాల్గొన్నారు.