ఆలూరు ( జనస్వరం ) : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిరుమన్ దొడ్డి గ్రామానికి చెందిన బోయ బాలమద్ది అనే జనసైనికుడు ఆరెకల్ లో పని నిమిత్తం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఆదోని బైపాస్ లో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా డి కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తొలి నుంచి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషిచేసిన బాలమద్ది గారు మరణాన్ని చింతిస్తూ, ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి తెర్నేకల్ వెంకప్ప గారి తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసీనా జనసైనికులు. బలమద్ది మట్టి ఖర్చులకు వెంకప్ప మరియు జనసైనికుల సహకారంతో 15,000/- వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే బాలమద్ది కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అరవింద్, బడేసబ్, వినోద్ మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com