
ముసునూరు, (జనస్వరం) : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరుపున జనసేన నాయకులు పాశం నాగబాబు ఆధ్వర్యంలో ముసునూరు మండలంలోని రమణక్కపేట జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు శారదాని సన్మానించడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు పాశం నాగబాబు, చేకూరి సాయి, నరేంద్ర, త్రినాథ్, రాజబోయిన సుబ్బు, శివ జనసైనికులు పాల్గొన్నారు.