విజయనగరం ( జనస్వరం ) : జగనన్న ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్నం ఏర్పాటు చేస్తున్న రుచికరమైన భోజనం స్కూల్ పిల్లలు తినలేక క్యారేజీలు తీసుకువస్తున్నారని జనసేన సీనియర్ నాయకులు చక్రవర్తి, మరియు హుస్సేన్ ఖాన్ అన్నారు. వారు మాట్లాడుతూ సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. వారు స్కూల్ కి వెళ్లి నేరుగా విద్యార్థులతో మాట్లాడి సమస్యను తెలుసుకొని స్కూల్ ప్రిన్సిపాల్ గారితో ఈ విషయంపై చర్చించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ సమస్యలన్నీ పరిష్కరించి తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు రమణ, పండు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com