Search
Close this search box.
Search
Close this search box.

కూకట్ పల్లి నియోజకవర్గంలో ఓటు ప్రాధాన్యతను వివరిస్తున్న జనసేన నాయకులు

కూకట్ పల్లి

       కూకట్ పల్లి ( జనస్వరం ) : కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ” మన ఓటు మన గుర్తింపు”  నినాదంతో KPHB కాలనీలో ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరు కొత్తగా ఓటను నమోదు చేయించుకోవాలని కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భముగా తుమ్మల మోహన్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ మన ఆయుధమే మన ఓటు మన ఓటు మన గుర్తింపు మన ఓటు దేశ ప్రగతికి మెట్టు ఆ ఓటు ద్వారానే ఒక మంచి నాయకుడిని ఎన్నుకుని చట్ట సభలలోకి పంపించడానికి ఓటు అత్యంత కీలకము అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో సలాడి శంకర్, సుంకర సత్య సాయి, వీరబాబు,అనిల్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way