మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారి మృతికి జగ్గయ్యపేట జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంతాపం
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల జగ్గయ్యపేట జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు నోముల రఘు మరియు జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ సంతాపం తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ఆయన తనదైన గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆర్థికమంత్రిగా, ప్రాణాళికసంఘం ఉపాధ్యక్షుడుగా, వాణిజ్యశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ మంత్రిగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని వారు తెలిపారు. ఒక మంచి నాయకుడిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పు సత్యం, శైలజ, మహేష్, రాజా తదితరులు పాల్గొన్నారు.