శ్రీకాళహస్తి ( జనస్వరం ) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గం జన సేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారు ఈరోజు రేణిగుంట పట్టణంలో తన స్వగృహం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం కలిగిందా అని, కోట్లు ప్రజా ధనం ఖర్చు పెట్టీ సభ పెట్టీ మీరు ప్రజలకు ఏమి మంచి చేశారో చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు మాట్లాడడం వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి ఒక్కటే భార్య ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఎంటో ఒక్క భార్య వల్ల రాష్ట్రానికి మీరు ఉద్దరించింది ఎంటో తెలపాలన్నారు. ముఖ్యమంత్రి కి ఒక్కటే భార్య ఉండడం వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా? ఒకటో తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నవా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎస్తున్నవా? సన్న బియ్యం ఇస్తాం అన్నావ్ ఇవ్వగలిగావా? పోలీసులకు పెండింగ్ లో ఉన్న టి.ఏ లు, డి.ఏ లు, సర్రండర్ లు ఇచ్చావా? CPS రద్దు చేశావా? జాబ్ క్యాలెండరు రిలీజ్ చేశావా? ఇలా ఒక్క భార్య ఉండడం వల్ల ఏమైనా సదించేసావ? వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడడం వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదన్నారు. ఇంకా ప్రొడక్షన్, డైరెక్షన్ అన్నారు ఎవరి ప్రొడక్షన్లో మా పార్టీ నడవాల్సిన అవసరం లేదు మీరే కెసిఆర్ ప్రొడక్షన్ లో ఎన్నికల్లో గెలిచి ఆయన డైరెక్షన్ లో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసావని వాపోయారు. ఇంకా ఉన్న సంవత్సరంలో అయినా ప్రజలకు మంచి చెయ్యాలని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే రొడ్లెక్కి బుద్ది చెప్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పాలూరు మునికుమార్, భాగ్యలక్ష్మి, త్యాగరాజులు, పార్థసారథి, జ్యోతి కుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.