Search
Close this search box.
Search
Close this search box.

పోలవరం పాచిపోయేనా ? పూర్తయ్యేనా ??

పోలవరం

                పోలవరం…  ఈ పేరు గత రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రజల నోళ్ళల్లో నానుతున్న పేరు. బహులార్థసాధక ప్రాజెక్టు ద్వారా సాగు నీటితో పాటు, మిగులు జలాలని కృష్ణానదికి తరలించడం ద్వారా కృష్ణా డెల్టా పయో్ర పాటు, అటు కృష్ణా జలాలని రాయలసీమలో ఉపయోగించడానికి దోహదం పడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు భూమి పెరగడమే కాక పరిశమ్రల అవసరాల కోసం కూడా వాడుకోవచ్చు. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు మొదలవడానికే దశాబ్దాల కాలం పట్టింది. ఎప్పుడో బ్రిటీషు వారు ప్రతిపాదించిన ప్రాజెక్టు ఎట్టకేలకు 2004 లో మొదలైంది. ప్రభుత్వాలు మారాయి, పార్టీలు మారాయి కానీ ప్రాజెక్టు మాత్రం అలాగే ఏ వృద్ధి లేకుండా ఉంది. 

          2018 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తిచేస్తాం – మంత్రి దేవినేని. డిసెంబర్ 2021 కల్లా పోలవరం పూర్తిచేసి నీళ్లు ఇస్తాం – మంత్రి అనిల్. ఈ రెండు వ్యాఖ్యానాలు అసెంబ్లీలో 3 సంవత్సరాల వ్యవధిలో చేసారు. వాస్తవానికి తెలుగుదేశం ఉన్నప్పుడు మార్చి 2019కి మట్టి పనిలో 82%, కాంక్రీట్ లో 74%, కట్టడాల్లో 52% పూర్తి చేశారు. అదే వైసిపి పార్టీ వచ్చాక మట్టిపనిలో 84%, కాంక్రీట్ లో 77%, కట్టడాల్లో 67%. చేశారు. అంటే ప్రభుత్వంలోకి వచ్చాక వైసిపి చేసింది చాలా తక్కు వ. 

తెలుగుదేశం తప్పులు : 

          ఆంధప్రద్రేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పక్రటించారు. అంటే దీని అర్థం దాని పూర్తి బాధ్యత కేంద్రానిదే. కానీ తెలుగుదేశం ప్రభుత్వం దానిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని తీసుకుని తామే టెండర్లు పిలిచారు. అసలు కేంద్ర ప్రాజెక్టు రాష్ట్ర పభ్రుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ లోపు రాష్ట్ర పభ్రుత్వం కుడికాలువ ద్వారా కృష్ణా నదికి నీరు తరలించడానికి పట్టిసీమ ఎత్తిపోతలను మొదలుపెట్టారు. పోలవరం పూర్తయ్యాక పట్టిసీమ నిరుపయోగం! ప్రభుత్వం పూర్తిచేసి ఉంటే అసలు ఈ పట్టిసీమ అవసరం ఉండేది కాదు. అంతే కాకుండా కేంద్రంలో పొత్తులో ఉండి కూడా పోలవరం కోసం సవరించిన అంచనాలకి ఆమోదం పొందలేకపోయింది. వెరసి పోలవరం పూర్తి కాకుండానే మిగిలిపోయింది. 

కేంద్రం తిరకాసు : 

       పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్రం చట్టంలో కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ వరకు మాతమే ఖర్చు భరిస్తామని మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాలి అని స్పష్టం చేసింది. అంచనాలు పక్రారం కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత పెట్టుకున్న ఖర్చును మాత్రమే రియంబర్స్ చేస్తామని 2014 ముందు చేసిన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ వాటా అని తేల్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్రం పెట్టిన 13000 కోట్లలో 11600 కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది. అంతేకాక 2018-19 ప్రకారం సవరించిన అంచనాలకి (55వేల కోట్లు) ఆమోదం తెలపకుండా కేవలం 2013-14 నాటి అంచనాలకే (29వేల కోట్లు) కట్టుబడి ఉందని చెప్పింది. పైగా పునరావాసం బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పింది.  పెరిగిన అంచనాలకి కారణం పెరిగిన ధరలు, కొత్త భూసేకరణ చట్టం 2014 వల్ల పెరిగిన ఖర్చు. కేంద్రంలో పొత్తులో ఉన్నప్పటికీ టిడిపి ప్రభుత్వం పనులు చేయించుకోలేక పోయింది. కేంద్రం ముఖ్యమైన పునరావాసం రాష్ట్రానికి ఇవ్వడం వల్ల బాధ్యత ఖర్చు పెరిగింది. 

పునరావాసం :

          కేంద్రం లెక్క పక్రారం ప్రాజెక్టు వల్ల మొత్తంగా లక్షా ఆరు వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం ఆరు వేల కుటుంబాలకు మాతమ్ర పునరావాసం కల్పించారు. దేశంలో అన్ని ప్రాజెక్టుల్లో లాగే బాధిత కుటుంబాల గురించి పట్టించుకోకుండా ప్రభుత్వాలు కేవలం ప్రాజెక్టు పూర్తిచేయడం మీదే శ్రద్ధ పెట్టడం వల్ల పేద కుటుంబాలు వలసబాట పెట్టాల్సి వస్తుంది. తాము తరతరాలుగా నమ్ముకున్న భూములు, అడవిని వదిలి ఇటు ప్రభుత్వం పట్టించుకోక ఇలా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పోలవరం బాధితుల వ్యధ మరో నర్మదా డ్యాం బాధితులలాగా అవ్వకూడదు. దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా పునరావాసం, పరిహారం అందించాలి. పునరావాసం కాలనీలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. జనసేనాని పవన్ పోరాట యాత్రలో భాగంగా పోలవరం పర్యటనలో నిర్వాసితులకు అండగా ఉంటాం అని స్పష్టం చేశారు. 

వైసీపీ ప్రభుత్వ పని తీరు :  

      తెలుగుదేశం కేంద్ర ప్రాజెక్టుని తీసుకుని తప్పు చేసింది అని వాదించిన వైసీపీ పార్టీ తాము కూడా ఆ రీతిలోనే ప్రాజెక్టు వాళ్ల కింద ఉంచుకుంది. కేంద్రం మెడలు వంచుతాం అని చెప్పిన వీళ్ళు కనీసం సవరించిన అంచనాలకి ఆమోదం పొందలేకపోయారు. రివర్స్ టెండర్ పేరుతో టెండర్లు పిలిచి పనిని నెలలుగా ఆపేసి కంపెనీని మార్చడం ద్వారా పోలవరం పనులు ముందుకు సాగలేదు! ఉన్న పనిని వేరే కంపేనీకి ఇచ్చి 780 కోట్లు ఆదా చేసినట్టు చెప్పింది. కానీ, ఆ డబ్బు ఏం చేశారు అన్నది వారే చెప్పాలి. యాదృచ్చికమో ఏమో కానీ ఆ గుత్తేదారు చేతిలోనే రాష్ట్రం ప్రధాన ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి. 2019 నుండి ఇప్పటి వరకు కాంక్రీట్రీలో 5%, మట్టిపనిలో 0.6%, స్టక్ర్చరల్ పార్ట్ లో 15% పని చేసారు. దీనికి అసెంబ్లీలో మంత్రివర్యులు డిసెంబర్ 2021 నాటికి పూర్తిచేస్తాం అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఒక పక్క గడువు పొడిగింపు 2022 ఏప్రిల్ నాటికి అని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ ఇంత పని ఇప్పటివరకు చేసిన పనిని పోల్చి చూస్తే ఈ ఏప్రిల్ కాక ఇంకొక ఏప్రిల్ పట్టేలా ఉంది. పరిహారంలో జాప్యం కారణంగా ఇటీవల వచ్చిన వరదల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలో సినిమాహాళ్ళ మీద చూపించిన విజ్ఞత ప్రాజెక్టు పూర్తి చేయడంలో పెట్టి ఉంటే పూర్తయ్యేది. విచ్చల విడి అప్పులు, తాకట్టులు చేసి పప్పూ బెల్లాలు పంచడానికి ఉన్న డబ్బు ప్రాజెక్టు మీద ఖర్చు చేయడానికి లేదు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి పోలవరం మీద ఉండే అవకాశం లేకపోలేదు. 

          ఒక పక్క అప్పులు కొండలా పెరిగిపోతుంది. ఇంకో పక్క అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. 2004లో 10వేల కోట్లు అంచనాలతో మొదలై ఇవాళ 55వేల కోట్లకు చేరింది. ఇంకో పక్క పునరావాసం గురించి పట్టించుకుకోక నిర్వాసితుల స్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇదేకాక పోలవరం ఎత్తు, ముంపు గ్రామాల విషయంలో ఒడిషా అడ్డంకులు, పర్యావరణ అనుమతులు లేకపోవడం, డిజైన్లు ఆమోదు కాకపోవడం, ఇలా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నచందంగా పోలవరం పూర్తికి ఎన్నో అడ్డంకులు. మొదటి నుండి జనసేన వైఖరి పోలవరం గురించి చాలా స్పష్టంగా ఉంది. 2017లో మైనింగ్ డంపింగ్ విషయం దగ్గర నుండి 2019 ప్రజాపోరాట యాత్రలో భాగంగా పోలవరం పర్యటనలో పునరావాసం గురించి, ముంపు ప్రాంతం భూములకి ఇవ్వాల్సిన పరిహారం గురించి పవన్ ప్రశ్నించారు. 2019లో భూసేకరణ చట్టం ద్వారా నష్టపోయిన రైతులు, ప్రజల కోసం ఒక అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు. 2020 లో నిర్వాసితులు ఇళ్లు కూల్చివేత సమయంలో వారికి అండగా నిలబడ్డారు. 

               జనసేన ముఖ్య సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకృతిని అభివృద్ధిని సమతూకంగా చూస్తూ, నిర్వాసితులకి, గిరిజనులకి అందరీకీ సంక్షేమం సమతూకంగా అందే విధంగా విధివిధానాలు రూపకల్పన చేయాలి అని అభిప్రాయపడ్డారు. దేశ పజ్రల కోసం తమ సొంత భూమి, ఆస్తులు ఇస్తున్నప్పుడు వారిని ఆ అభివృద్ధిలో భాగస్వామ్యులుగా చేయకుండా వారిని ఇబ్బందిపెట్టడం మంచిదికాదని అన్నారు. 

         ఇందులో తప్పు ఎవరిది? సకాలంలో పూర్తిచేయలేకపోయిన ప్రతి గత పాలకులు దీనికి బాధ్యులే! ప్రాజెక్టు తీసుకొచ్చి రాష్ట్రానికి భారం చేసిన వాళ్ల దగ్గర నుండి అంచనాల్ని ఆమోదింప చేయలేక, టెక్నాలజీని అడ్డు పెట్టుకుని దోబూచులాడుతున్న వారిది కూడా. పోలవరం కల సాకారం కావాలి అంటే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రపభ్రుత్వాలు రాజకీయాలు పక్కనపెట్టి, సహేతుకంగా నిర్వాసితులని, గిరిజనులకి నష్టం పరిహారంతో పాటుగా పునరావాసం కల్పించాలి. సవరించిన అంచనాల్ని ఆమోదించి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తిచేయడంలో పభ్రుత్వాలు కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే పోలవరం కల సాకారం అవుతుంది.

 

#Written By

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని
20240225_134850
నాయకుడు తీసుకున్న నిర్ణయం తప్పా ? రైటా??
జనసేన
జనసేన - నా సేన కోసం నా వంతు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way