Search
Close this search box.
Search
Close this search box.

పాలన చేస్తోంది ప్రభుత్వమా ? పవన్ కళ్యాణా ??

pawan kalyan jagan

        ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరి బాగోగులు చూసుకునే బాధ్యత ఉంది. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు పరిరక్షించేలా, అందరికి సమాన అవకాశాలు కల్పిస్తూ, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూసుకోవాలి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అప్పు తీసుకురావటం వాటిని వాళ్ళ వాళ్ళకి దోచి పెట్టడం తప్ప రాష్ట్రములోని పరిస్థితులను పట్టించుకునే స్థితిలో లేదు. రాష్ట్రములో ఎంతో మంది కౌలు రైతులు అనేక ఇబ్బందుల వల్ల అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితులలో ఆత్మ హత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చెయ్యట్లేదు. 

                 రైతుల కష్టాలు అందరికి తెలిసినవే అయినా కూడా ఏ ప్రభుత్వంకూడా వాటిని పరిష్కరించే మార్గాన్ని చూడట్లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యింది. కొత్త కొత్త నిబంధనలు తెచ్చి కౌలు రైతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అలాగే 5 మందికే కార్డులు ఇస్తే చాలు అని టార్గెట్ పెట్టుకొని మిగితా వాళ్ళందరిని గాలికి వదిలేసింది. రైతు భరోసా కేంద్రాలు పెడుతున్నాం అని కాంట్రాక్టులు తీస్కోటంలో ఉన్న శ్రద్ధ రైతులకు ఉపయోగపడటం లేదు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఎంత మందికి విత్తనాలు సరఫరా చేసారు? ఎంతమందికి ఎరువులు అందించారు? మద్దతు ధర అందించటంలో కానీ, పంటను దాచుకోటానికి గోడౌన్ల విషయంలో కానీ రైతుకు ఎంత మేర సహాయం అందించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ మీద ప్రకృతి పగ పట్టింది. ఎప్పుడు చూసినా ఏవో ఒక తుఫాన్లు లేక వరదలు. దీంతో రైతు చాల నష్ట పోయాడు. ఏ ఒక్క తుఫాన్ నష్ట పరిహారం అయినా పూర్తిగా అందరికి అందించారా? తిరిగి పెట్టుబడి పెట్టడానికి సహాయం చేసారా ? రాష్ట్ర ప్రభుత్వం దేనికి నడుస్తున్నట్టు. కేంద్ర ప్రభత్వం డబ్బులు మాత్రమే ఇవ్వగలదు రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి రైతును కాపాడాలి. అది వదిలేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇచ్చేసి మా పని అయిపొయింది అని చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి బాధ్యతలేని ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అనేక మంది కౌలు రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. వాటి మీద కూడా ప్రభుత్వం బాధ్యత వహించట్లేదు. వారికి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాటిని కౌలు రైతుల ఆత్మ హత్యలు కాదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుకు 7 లక్షలు ఇస్తాం అని గొప్పగా చెప్పిన వైసీపీ పార్టీ ఏ ఒక్కరికి కూడా డబ్బులు పూర్తి గా ఇవ్వలేదు.

                ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాల్సిన పనిని జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ప్రభుత్వం రైతు కుటుంబాల దగ్గరకు వెళ్లి వాళ్ళకి భరోసా నింపి వారికీ డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు జనసేన పార్టీ ఆ రైతు కుటుంబాలను పరామర్శించటానికి పూనుకుంది. అంతే కాకుండా తన సొంత డబ్బులు రైతులకి ఇచ్చి వాళ్లలో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనసేన పార్టీ చెయ్యాల్సిన పని కాదు. మనం అంతా ఎందుకు పన్నులు కడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నడవాలని కదా? మరి రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఎందుకు జనసేన పార్టీ రైతు కుటుంబాలను ఆదుకోవాలి. మనం ఎన్నుకున్న రాష్ట్ర ప్రభత్వం మన రైతు సోదరులను ఎందుకు ఇలా వదిలేసింది. అన్నం పెడుతున్న మన రైతు చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శించే దిక్కు కూడా లేదా?

           ప్రభుత్వం రైతులను కులాలుగా విడదీయ్యటంలో ఉన్న ఆంతర్యం ఏంటి. ఒక రైతు చనిపోతే ఆ అప్పులు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చెయ్యదా? అంతే కాకుండా కేవలం కొంత మందికి మాత్రమే కార్డులు ఇస్తాం అంతే మిగితా రైతులు ఎందుకు పంటలు పండించాలి. వాటిని ప్రభుత్వానికి ఎందుకు అమ్మాలి. రైతులు అందరు పంటలు పండించాలి. వాటిని మీ దళారుల ద్వారా మీరు సొమ్ము చేసుకోవాలి. కానీ రైతుని మాత్రం ఆదుకోరు. వాళ్ళ కుటుంబానికి ఆపద వస్తే మాత్రం పట్టించుకోరు. ఎటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు 100 శాతం మందిని ఆదుకోలేదు. కానీ మరి దారుణంగా ఏ ఒక్కళ్లని ఆదుకోడానికి సిద్ధం గా లేదా? వేలల్లో కౌలు రైతులు మరణిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ మౌనం దేనికి సంకేతం. క్రితం ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దటానికి మిమ్మల్ని ఎన్నుకుంటే వాళ్ళు ఎం చేసారో మేము కూడా అదే చేస్తున్నాం అని చెప్తే ఇంకా మిమ్మల్ని ఎన్నకున్నట్టు. అయితే మిమ్మల్ని ఎన్నుకోటంలోనే తప్పు జరిగింది. ఆ తప్పు సరి చెయ్యటానికే జనసేన పార్టీ ప్రభుత్వం చెయ్యాల్సిన పని చేస్తోంది. ఆంటే జనసేన మరో ప్రభుత్వాన్ని నడుపుతోందా? దానికి అవకాశం ఎవరిచ్చారు? మీ అసమర్ధత చేతకాని తనం కాదా?

              రాష్ట్రంలో ఉన్న జనసైనికులు అందరు కూడా ప్రతి కలెక్టర్ దగ్గరకి వెళ్లి ఆత్మ హత్య చేసుకున్న రైతుల లిస్ట్ తో వాళ్లందరికీ నష్ట పరిహారం వచ్చే దాక పోరాడాలి. మనం పన్నులు కడుతోంది అందుకే. మన జేబులోంచి ఇవ్వటం కన్నా రాష్ట్ర ప్రభుత్వం చేత పని చేయించటం ముఖ్యం. 

#Written By

ట్విట్టర్ : @vss_ramesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని
20240225_134850
నాయకుడు తీసుకున్న నిర్ణయం తప్పా ? రైటా??
జనసేన
జనసేన - నా సేన కోసం నా వంతు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way