
రాయవరం, (జనస్వరం) : రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో శ్రీ సర్వరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను చెల్లూరు జనసేనపార్టీ నాయకులు పరిశీలించగా పాఠశాలలో ఉన్న సమస్యలను గుర్తించడం జరిగింది. పాఠశాల స్లాపు నుండి గదులలోకి వర్షం నీరు రావడంతో విద్యార్థిని, విద్యార్ధులు అసంతృప్తి చెందుతున్నారు అని తెలిపారు. పాఠశాల గదులలో నీరు నిలిచిపోవడం వలన దోమలు, అనేకరకాల పురుగులు, చేరి విద్యార్థిని, విద్యార్ధులు అనారోగ్యంతో గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అసంపూర్తిగా ఉన్న స్కూల్ బిల్డింగ్ ను వెంటనే నిర్మించాలని విద్యాశాఖ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.