అనంతపురం ( జనస్వరం ) : మా సమస్యలు పరిష్కరించండి అంటూ 47వ డివిజన్ మైనార్టీ మహిళలు జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టీ.సీ.వరుణ్ వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. అనంతపురము రాంనగర్ కార్యాలయంలో టి.సి.వరుణ్ ని మైనార్టీ మహిళలు కలిశారు. 47వ డివిజన్లో నెలకొన్న సమస్యలను వారు ఏకరవు పెట్టారు. ముఖ్యంగా తాగునీటి పైప్ లైన్ లీకేజీ కారణంగా అక్కడక్కడ డ్రైనేజీ వాటర్ కలవడం ద్వారా మంచినీరు కలుషితమవుతోందన్నారు. గత్యంతరం లేక ఆ నీటిని తాగడం వల్ల అనేకమంది అనారోగ్యాల పాలవుతున్నారని వాపోయారు. పలుమార్లు మునిసిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదని.. ఎమ్మెల్యే పర్యటించిన సందర్భంలో సమస్యను వివరించిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తప్ప పరిష్కారం చేసిన పాపాన పోలేదన్నారు. మీరే మాకు న్యాయం చేయాలని, మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని టి.సి.వరుణ్ కి మైనార్టీ మహిళలు విజ్ఞప్తి చేశారు. టి.సి.వరుణ్ గారు సానుకూలంగా స్పందిస్తూ.. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, నాయకులు, జనసైనికులు మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.