Logo
Date of Publish : 08 February 2024, 10:52 pm
Editor : Sake Naresh

ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్పందించని ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు..

     అనంతపురం ( జనస్వరం ) : మా సమస్యలు పరిష్కరించండి  అంటూ 47వ డివిజన్ మైనార్టీ మహిళలు జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్  టీ.సీ.వరుణ్  వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. అనంతపురము రాంనగర్ కార్యాలయంలో టి.సి.వరుణ్ ని మైనార్టీ మహిళలు కలిశారు. 47వ డివిజన్లో నెలకొన్న సమస్యలను వారు ఏకరవు పెట్టారు. ముఖ్యంగా తాగునీటి పైప్ లైన్ లీకేజీ కారణంగా అక్కడక్కడ డ్రైనేజీ వాటర్ కలవడం ద్వారా మంచినీరు కలుషితమవుతోందన్నారు. గత్యంతరం లేక ఆ నీటిని తాగడం వల్ల అనేకమంది అనారోగ్యాల పాలవుతున్నారని వాపోయారు. పలుమార్లు మునిసిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదని.. ఎమ్మెల్యే పర్యటించిన సందర్భంలో సమస్యను వివరించిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తప్ప పరిష్కారం చేసిన పాపాన పోలేదన్నారు. మీరే మాకు న్యాయం చేయాలని, మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని టి.సి.వరుణ్ కి మైనార్టీ మహిళలు విజ్ఞప్తి చేశారు. టి.సి.వరుణ్ గారు సానుకూలంగా స్పందిస్తూ.. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, నాయకులు, జనసైనికులు మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com