
విజయవాడ ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నూజివీడు నియోజకవర్గ చాట్రాయికి చెందిన విజయవాడలో చదువుతున్న పైలా సుష్మిత ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న విషయం తెలుసుకొని, ఆమె ఫీజు నిమిత్తంNRI జనసేన హౌస్టన్ మరియు ఆప్త సభ్యులు 1,03,000( లక్ష మూడు వేల ) రూపాయల నగదు రూపంలో విజయవాడ నగర జనసేన పార్టీ అధ్యక్షులు, పశ్చిమ నియజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్ గారి చేతుల మీదుగా అందించటం జరిగింది. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఎన్నారై జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి సహాయం చేస్తున్నారని వారికి పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డి మణి, విజయవాడ దార్మిక మండలి సభ్యురాలు నిట్ల ఉమ మహేశ్వరి, అలియ బేగం, నాని, సతీష్ పాల్గొన్నారు.