రేషన్ ఇంటింటికి అందిస్తామన్న ప్రభుత్వ వాగ్దానాన్ని సక్రమంగా అమలు చేయాలని జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రమైన గోనెగండ్లలో ఆదివారం రోజు ఫిబ్రవరి నెల చివరిరోజు కావడంతో గత నెల రేషన్ సరుకులు వచ్చేనెల మార్చిలో రెండు నెలలకు సంబంధించిన రేషన్ ఇవ్వరని రోజు వారి కూలి పనులు విడిచి రేషన్ షాపుల ముందు బారులు తీరారని తెలిపారు. ఇంటింటికి రేషన్ అందిస్తామని ప్రారంభించిన పథకం తీవ్ర గందరగోళనికి దారి తీయడంతో రేషన్ పంపిణీ సక్రమంగా జరగలేదని అన్నారు. ఇంటింటికి రేషన్ కాకుండా రోడ్లపై వాహనాలు ఉంచి నడిరోడ్డుపై నిలబెట్టి రేషన్ అందించే పద్ధతి ఏర్పడిందని పనులు మానుకొని రేషన్ కోసం రోజులు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఫిబ్రవరి నెలలో రేషన్ అందని వారిని గుర్తించి రెండు నెలలకు ఇవ్వాల్సిన రేషన్ మార్చి నెలలో పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.