గుంటూరు, (జనస్వరం) : షాదీ తోఫా పై పెట్టిన ఆంక్షలు ఎత్తివేయాలని శనివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి, మైనార్టీ నాయకులు షేక్ నాయబ్ కమల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పేద ముస్లిం కుటుంబాలకు ఇచ్చే షాదీ తోఫాపై పెట్టిన ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా షాది తోఫాను పెళ్లి రోజునే ఆ కుటుంబాలకు అందజేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరై సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చే షాదీ తోఫా గత ప్రభుత్వంలో 50 వేలు ఇస్తే.. మా ప్రభుత్వం వచ్చాక రూ.లక్ష ఇస్తామని ప్రచార ఆర్భాటాలకు పోయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు ఏళ్లు గడుస్తున్న ముస్లింలకు ఇచ్చే షాది తోఫా ఇప్పటిదాకా ఇవ్వకుండా.. ఇప్పుడేమో కొత్తగా ఆంక్షలు పెట్టి అది కూడా పెళ్లైన సంవత్సరం లోపు ఇస్తామని, కొత్తగా ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. తక్షణమే ఆంక్షలను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ వెంకట మారుతీరావు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జేఎస్‌ఆర్), ఎంటీఎంసీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, మంగళగిరి నియోజకవర్గం నాయకులు చిట్టెం అవినాష్, సీనియర్ నాయకులు నారాయణ, నూతక్కి గ్రామ నాయకులు షేక్ నాగుల్ షరీఫ్, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, జనసేన నాయకులు పెద్దినేని వేణు, బేతపూడి గ్రామ నాయకులు వాసా శివన్నారాయణ, మంగళగిరి పట్టణ జనసేన నాయకులు షఫీ, సాలెహన్ తదితరులు పాల్గొన్నారు.