నెల్లిమర్ల ( జనస్వరం ) : జనసేన తెలుగుదేశం పార్టీలో అధిష్టానం ఆదేశాలు మేరకు ఉమ్మడిగా డెంకాడ మండలంలోని అక్కివరం జొన్నాడ గ్రామాల మధ్య ఉన్న రోడ్లపై ర్యాలీగా వెళ్లి నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ లోకం మాధవి మరియు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కర్రోతి బంగార్రాజు సంయుక్త సారధ్యంలో గుంతలు ఆంధ్ర ప్రదేశ్ దారేది కార్యక్రమంలో నిరసనలు చేపట్టారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లపై ప్రయాణం నరకంగా ఉందని వైసిపి ప్రజా ప్రతినిధులకు తెలిసేలాగా గుంతలు ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో సుమారు మూడు కిలోమీటర్ల పాటు నిరసనలు చేపట్టారు..ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మరియు మండల తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com