గుడివాడ ( జనస్వరం ) : పట్టణ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అనారోగ్యంతో ఒక పెద్ద అయినా చనిపోవడంతో ఆ ఊరి ప్రజలకు తెలియజేయడంతో ఎవరు రాకపోవడంతో పోలీసు వారి సూచనల తో గుడివాడ పట్టణ జనసైనికులు ఆ పెద్దాయనకు అన్ని తామై అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు భాగంగా ఈరోజు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గుంట కోడూరు గ్రామానికి చెందిన నవగట్ల పాపారావు అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో ఆ గ్రామ ప్రజలు ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ సమాచారాన్ని మాకు తెలియజేయగా వెంటనే స్పందించి ఆ పెద్దాయనకు అన్నీ మేమే అంతక్రియలు చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకున్నామని తెలియజేశారు. అదేవిధంగా దైవం మనుష్య స్వరూపమని దేవుడు ఎక్కడో లేడని మనుషుల్లోనే ఉంటారని మనము ఎంత పవిత్రంగా జన్మిస్తామో అదే పవిత్రంగా చివరి దశలో కూడా వెళ్లాలని మా ఆకాంక్షాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కిరణ్, శివ, చరణ్, మరియు జన సైనికులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com