గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో పేద కుటుంబానికి చెందిన చిన్నారి అనారోగ్యంతో మృతి చెందడంతో అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేకపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జనసైనికులకి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన జనసైనికులు ఆ చిన్నారి మృతదేహానికి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ RK మాట్లాడుతూ ఈ రోజు చాలా బాధాకరమైన రోజు ఆడుతూ పాడుతూ తిరిగే ఆ పసిపాప చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతి అయ్యాయని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ అనేక పథకాలు ప్రవేశపెట్టారని కానీ నిరుపేదలకు ఏ పథకం అందట్లేదని వారికి పని లేక ఆకలి చావులతో చనిపోతున్నారని 50 ఇళ్లకు ఒక వాలంటీర్లను పెట్టామని మంచి అయినా చెడు అయినా అంతా వాళ్లే చూసుకుంటారని ప్రభుత్వం చెబుతున్నారు. మూడు రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేక ఆ నిరుపేద కుటుంబం ఇబ్బంది పడుతుంటే మనుషుల అయ్యి వుండి మనం పట్టించుకోకపోవడం చాలా దౌర్భాగ్యం అని మానవత్వం మంటగలిసి పోతుంది అని అన్నారు. నేను నా కుటుంబం అని కాకుండా సమాజం బాగుండాలి మానవత్వ విలువలు కాపాడాలని నా సూచన. మళ్లీ ఇలాంటి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ జనసేన ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, జగదీష్, చరణ్ జనసైనికులు పాల్గొన్నారు.