ఒరిస్సా రైలు ప్రమాద మృతులకు కొవ్వొత్తులతో అశ్రునివాళులు అర్పించిన గుడివాడ జనసైనికులు

ఒరిస్సా

         గుడివాడ ( జనస్వరం ) : ఒడిస్సా రాష్ట్రంలోని బాలసూర్ జిల్లాల్లో రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఆసువులు బాసిన 280 మంది మృతులకు కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో జనసైనికులు మరియు ఆర్య డాన్స్ అకాడమీ పిల్లలతో కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ చిన్న తప్పిదం వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటు గుడివాడ పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులు అర్పించడం జరిగిందని, మృతులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఈ ప్రమాదంలో గాయపడిన వందలాది మంది ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, చరణ్ తేజ్, పందిళ్ళ శీను గంట అంజి మరియు ఏఏ అకాడమీ అధినేత ఆర్య మాస్టర్ మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way