
పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో శ్రీ కోటదుర్గమ్మ తల్లి జంక్షన్ పరిధిలో ధాన్యం రైతులుకి అండగా ఉండటానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన. సత్తిబాబు గారు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని, రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు న్యాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియచేయడం జరిగింది.