పాఠశాలల్లోనే పిల్లలకు ఉచితంగా అల్పాహారం అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ను తమిళనాడు సీఎం స్టాలిన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తమిళనాడు రాష్ట్ర ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు ఉదయం పూట అల్పాహారం అందించనున్నారు. దీంతో దేశంలోనే పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com