డెంగ్యూపై యుద్ధం ప్రకటించిన భారత్ వ్యాక్సిన్ తయారీకి సిద్ధమవుతోంది. హైదరాబాద్ కంపెనీ ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్ లిమిటెడ్ (IIL) వ్యాక్సిన్ సిద్ధం చేస్తుండగా, 2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రాథమిక దశ ప్రయోగాలు ముగిశాయని, వాటిల్లో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదని కంపెనీ తెలిపింది. కాగా, 2, 3 ఏళ్లలో రెండో దశ ట్రయల్స్ జరుగుతాయి. ఈ ఏడాది 31,464 డెంగ్యూ కేసులు నమోదు కాగా 36 మంది చనిపోయారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com