జనస్వరం ( అనంతపురం ) : కదిరి నియోజకవర్గంలో బాలసముద్రం పంచాయితీలో కొంతమంది వృద్ధులకు పెన్షన్ రావట్లేదాని జనసేన పార్టీ తరుపున గెలిచిన ఎంపిటిసి అమర్ కార్తీకేయ దృష్టికి వచ్చింది. కార్తీకేయ పంచాయితీలో పరిధిలో పర్యటించి పెన్షన్ రాని వృద్ధులను గుర్తించారు. వారికి పెన్షన్ రావట్లేదాని సచివాలయంలో అధికారులను ఆరా తీశారు. అధికారులు వివిధ కారణాలు చెప్పి మభ్యపెట్టారు. ఆయన మాట్లాడుతూ ఆ వృద్ధులకు పెన్షన్ నేనే ప్రతి నెలా నెలా ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలాగైనా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి రావాలని అధికారులను హెచ్చరించారు. జనసేన పార్టీ గెలిస్తే న్యాయం చేస్తామని, ఓడిపోతే సహాయం చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మా వంతుగా ఆ వృద్ధులకు కాస్తా ఊరటనిచ్చేలా నెలకు 310/- రూపాయలు జనసేన పార్టీ తరుపున పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. జగన్ పాదయాత్రలో అవ్వతాతలకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి తీరా వారిని మోసం చేస్తున్నారు. అన్నీ అర్హతలు ఉన్నా వారికి పెన్షన్ అందడం లేదని త్వరలోనే అధికారులను కలసి వారికి పెన్షన్ వచ్చేలా పోరాడతామని అన్నారు.