
విజయనగరం, (జనస్వరం) : విజయనగరం నియోజకవర్గంలో స్థానిక 44వ డివిజన్ అయ్యన్నపేటలో జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లాలి శెట్టి రవితేజ, ఎర్నాకుల చక్రవర్తి, జిల్లా యువజన విభాగం నాయకులు లోకల్ బాయ్ ప్రసాద్, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు భారీగా పాల్గొన్నారు.