
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి సిగడం మండలంలోని పాలఖండ్యం పంచాయితీ జగన్నాదపురం గ్రామంలో ఒక నిరుపేద వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న పూరిల్లు అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్లనియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి క్రాంతి శ్రీ గారు అగ్ని బాధితులకు పరామర్శించి, కొంత డబ్బును అందజేసి, ఎప్పుడు కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు. మాట్లాడుతూ అలాగే ప్రతీ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు, కాకర్ల బాబాజీ, జి.సిగడాం మండల జనసైనికులు దినేష్, రాజేష్, నర్సుములు, సాయి, అలాగే పాలఖండ్యం జనసైనికులు పాల్గొన్నారు.