చిత్తూరు ( జనస్వరం ) : పాలసముద్రం మండలం., పాలసముద్రం గ్రామపంచాయతీ., రాచపాలెం గ్రామంలో దగ్ధం అయిన శేఖర్ రాజు చెరుకు తోటను పరిశీలించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న. ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్లే పంట నష్టం జరిగిందన్నారు. అనేక మార్లు అనగా గత మూడు నెలలుగా రైతు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించని విద్యుత్ శాఖ అధికారులు. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకి నష్టం జరగకూడదని అదే జనసేన పార్టీ డిమాండ్ అని అన్నారు. రైతుకు నష్టపరహారం అందించే విధంగా సంబంధిత శాఖ అధికారులు చొరవ, చర్యలు తీసుకోవాలి. విద్యుత్ లైన్ ఎత్తును పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భాను చంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులు వాసు నాయుడు, రాఘవ, రేణు ప్రసాద్, ప్రవీణ్, జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.