అరకు ( జనస్వరం ) : అరకు నియోజకవర్గం పర్యాటక కేంద్రమైన టౌన్ షిప్ మరియు శరభ గూడ వీధి కంఠబొంసు, గూడాసి కాలనీ, కొండ వీధి, ఆదివాసి కాలనీ తదితర వీధిలో డ్రైనేజ్ సమస్య వల్ల అపరిశుభ్రం ఏర్పడడం వల్ల వీధిలో ఉన్న ప్రజలకు మలేరియా డెంగ్యూ తదితర వ్యాధులతో ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంటుందని జనసేన నాయకులు అన్నారు. టౌన్ షిప్ పరిధిలో పంచాయతీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీ నిండా అక్కడక్కడ చెత్తాచెదారంలతో డ్రైనేజ్ అంతా నిండిపోయి ఉన్నదని, దీనివల్ల వర్షాలు పడినప్పుడల్లా నీటి నిల్వ ఉండిపోవడం జరుగుతుందని గిరిజనులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, జనసేన అరుకు దుంబ్రిగుడ మండల అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ కొన్నేడిచిన్నారావు, కిలో రాజా భారత్ తదితరులు శరబ గూడ వీధలో పర్యటించారు. అనంతరం డ్రైనేజ్ ని పరిశీలించడం జరిగినది. ఈ సమస్య పట్ల సంబంధిత పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీ సమస్య ఏర్పడిందని మండల ఎంపీడీవో గారికి జనసేన బృందం తక్షణమే పరిష్కారం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగినది.