ఎచ్చెర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల మండలం తోటపాలేం పంచాయతీ అఖింఖాన్‌పేట గ్రామం జనసైనికులు క్రికెట్ లో ప్రతిభ కనపరుస్తుంటారు. వారికి సరైన క్రీడా సామాగ్రి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విష్వక్సేన్ వారికి క్రీడా సామాగ్రి అందించాలని అనుకున్నారు. అనుకున్న వెంటనే వారికి క్రికెట్ కిట్ అందించారు. గ్రామ జనసైనికులకు డా విష్వక్సేన్ గారి ఆర్థిక సహాయంతో శ్రీకాకుళం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు కాకర్ల బాబాజీ క్రికెట్ కిట్ అందచేసారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com