
విజయవాడ, (జనస్వరం) : కొంతకాలంగా అనారోగ్యా సమస్యలతో ఇబ్బంది పడుతూ జనసేన కార్యకర్త పడాల సురేష్ (ఏసు) గారు ఆదివారం మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ గారు అక్కడికి చేరికొని మృతదేహానికి నివాళులార్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్యపడకండి.. అండగా ఉంటామని మృతుని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నవీన్, మదన్, పోలవరపు దుర్గారావు (పెద్దోడు), వేపకాయల చిరంజీవి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.