నంద్యాల ( జనస్వరం ): ఆలూరు మండలం 4వ వార్డు ఇంద్రనగర్ డమర వీధిలో డ్రైనేజీలో మురికి నీరు నిల్వ ఉండడంతో దోమలకు నివాసంగా మారుతున్నాయని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. ఇలాంటి సమస్య 2వ వార్డు 3వ వార్డు లో కూడా ఉందని సర్పంచులు, సంబంధిత అధికారులు శుభ్రపరిచే ఆలోచన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషపు రోగాలకు దారి చూపుతున్నారని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతారహిత్యంగా సర్పంచులు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కనీసం దోమల నివారణకు పిచ్చికారి చేయించాలని బీచింగ్ పౌడర్ కూడా చల్లించాలని సంబంధిత అధికారులను కోరుకుంటున్నానని అన్నారు.