తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 02 (జనస్వరం) : ప్రజారంజక పాలన అందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడులో మంగళవారం పల్లెపోరు మూడో రోజు కార్యక్రమంలో బొలిశెట్టికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ తాతాజీతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు విసిగిపోయిన ప్రజలు కూటమి రావాలని కోరుకుంటున్నారని వారి అదృష్టం త్వరలోనే నెరవేరుతుంది అన్నారు. భారీగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అందించిన ప్రజలను సంక్షేమం పేరుతో వంచించిన జగన్ ను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.