
శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ కవిటి మండలంలో కిడ్నీ ప్రభావిత ప్రాంతాలలో ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు గారు పర్యటించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు దాసరి రాజు వారి ఎదుట తమ గోడును వినిపించారు సోంపేట కవిటి సెంటర్లో పడకలు ఖాళీ లేక సుదూర ప్రాంతాల్లోకి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నామని అలాగే సోంపేట కవిటి డయాలసిస్ సెంటర్లో పడకలు పెంచేటట్లు చూడాలని వారు కోరారు. మూడు నెలలకోసారి కిడ్నీ టెస్ట్ లు చేసేలాగా చూడాలని రాజు గారి దగ్గర తెలిపారు. రాజు గారు మాట్లాడుతూ త్వరలో ఈ సమస్యలపై కలెక్టర్ గారితో కలసి సమస్య పరిష్కారం అయ్యేటట్లు చూస్తాం అని తెలిపారు.