కదిరి, (జనస్వరం) : రాష్ట్రంలో కొత్తగా పాలేరు ఉద్యోగం తీసుకున్న గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, మెట్టు సత్యనారాయణ మీరు నిజంగా కాపు పుట్టుక పుట్టి ఉంటే ముందు మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ఆయన ఎన్నికల హామీగా కాపు కార్పొరేషన్ కు సంవత్సరానికి రెండు వేల కోట్లు ఇస్తానన్న ఎన్నికల హామీని నెరవేర్చమనండి. ఇప్పటికి ఆరు వేల కోట్లు కాపు కార్పొరేషన్ కు నిధులు జమ చేసి, అలాగే ఇప్పటికే రెండుసార్లు కాపు కోర్పొరేషన్ చైర్మన్ లను నియమించారు. గతంలో కార్పొరేషన్ కు చైర్మన్ ను మాత్రమే నియమించారు. డైరెక్టర్లును నియమించలేదు. ఇప్పుడు ఐదు జిల్లాలకు డైరెక్టర్ లు లేరు. జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల కన్నీళ్ళు తుడవడానికి తన స్వంత డబ్బులు 30 కోట్లు ఇస్తున్న వ్యక్తిని మీరు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని ఒక్కసారి ఆలోచించండని అన్నారు. ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న మద్దతును చూసి ఓర్వలేక అలాగే మీ పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారడం సహించలేక, వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. మీకు చేతనైతే ప్రభుత్వం తరపున 3000 ఆత్మహత్యలు చేసుకున్న ఒక్కొక్క కుటుంబంకు 7 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాలలో జమ చేయండి. ముందు అవన్నీ నెరవేర్చి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి. అంతేగాని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే చూస్తూ ఊరుకోం అని కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ తెలియజేశారు. ఈ సమావేశంలో రాప్తాడు ఇంచార్జ్ పవన్ కుమార్, కదిరి రూరల్ మండలం అధ్యక్షుడు చిల్లా మహేష్, జిల్లా కార్యక్రమాల నిర్వాహణ కమిటీ సభ్యులు కుటాల లక్ష్మణ్, అంజిబాబు, చెక్క రమణ, లోకేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.